ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభమవుతాయని మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి గజానంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలతో ఇటీవల ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ చేయడం జరిగిందని, ఈ విషయాన్ని రైతులు గమనించి సీసీఐకి నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి విక్రయించాలని కోరారు.
రేపు థింకింగ్ డే
ఆదిలాబాద్‌టౌన్: స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 22న జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ కార్యాలయంలో థింకింగ్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ప్రణీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ మాస్టర్లు, గైడ్ కేప్టెన్లు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సర్వమత ప్రార్థనలతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండా ఆవిష్కరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు విద్యార్థులతో హాజరు కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment