వాతావరణం రోజంతా ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పె
పెద్దలను ఒప్పించే ధైర్యం ఉండాలి
నిజమైన ప్రేమ మనల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేయదు. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించే ధైర్యం ఉండాలి. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల ఆశయాలను వమ్ముచేయొద్దు. వారి ఆలోచనలకు విలువ ఇవ్వాలి.
– మమత, డైట్ కళాశాల సూపరింటెండెంట్
నమ్మకం అనే పునాది పైన..
జీవితం అనేది నమ్మకం అనే పునాదిపై ఉంటుంది. ఇద్దరి మధ్య నమ్మకం ఉంటేనే ఏ పెళ్లయినా సాఫీగా సాగుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. యుక్త వయస్సులో పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణే. దీనివల్ల భవిష్యత్ నాశనం అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. – ఎం.ప్రజ్ఞవి
సంస్కృతిని మరువొద్దు
చాలా మంది మన సంస్కృతిని మర్చిపోయి పాశ్యాత్య సంస్కృతికి అలవాటుపడుతున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది ప్రేమ. పెళ్లికి ముందు ఉండేది కాదు.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటే వారి జీవితం సాఫీగా ఉంటుంది. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. జీవితంలో ఓ స్థాయికి ఎదిగిన తర్వాతే ప్రేమ పెళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా చేసుకోవడం మంచిది.
– ప్రణిత,
జిల్లా విద్యాశాఖాధికారి
వాతావరణం రోజంతా ఎండగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పె
Comments
Please login to add a commentAdd a comment