
ఆక్రమణలా.. డయల్ చేయండి
● ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్ 94921 64153 ● భూ కబ్జాల కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ● సద్వినియోగం చేసుకోవాలంటున్న కలెక్టర్
కై లాస్‌నగర్: ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఎవరైనా కబ్జా చేశారా.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వాటిని విక్రయించేస్తున్నారా.. ఇలాంటి వాటిపై ఎ వరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇకపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. భూ ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు టోల్‌ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంను సైతం నియమించారు. కలెక్టర్ రాజర్షి షా ఆ దేశాల మేరకు చేపట్టిన ఈ చర్యలపై సర్వత్రా హ ర్షం వ్యక్తమవుతుంది. అయితే భూ ఆక్రమణలకు ఇ ప్పటికై నా అడ్డుకట్ట పడుతుందా.. లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాత పరిస్థితే పునరావృతమవుతుందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణంలో స్థిర నివాసం ఏ ర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఏర్పడుతోంది. తదనుగుణంగా రియల్ వ్యాపారం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొంత మంది అక్రమార్కులు అసైన్డ్, ఇ నాం, ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. పట్టణంతో పాటు బట్టిసావర్‌గాం, మావల గ్రామాల్లోని మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే చా లు అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. చర్యలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అక్రమార్కులు పలువు రు అధికారులను మచ్చిక చేసుకుని తప్పుడు ధ్రువీ కరణపత్రాలు సృష్టిస్తున్నారు. వాటి ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతూ బోగస్ డాక్యుమెంట్స్‌తోనే రిజిస్ట్రేషన్లు చేసి అమాయకులకు విక్రయించేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్న సర్వే నంబర్ 170, ఇందిరమ్మ కాలనీ, కేఆర్‌కే కాలనీ, బట్టిసావర్‌గాం, మావలల్లో ఈ దందా య థేచ్ఛగా సాగుతోంది. కొంతమంది మాజీ కౌన్సిలర్ల బంధువులు, దళారులు ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో లీనమవుతున్నారంటే ఆక్రమణల పర్వం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఎలా ఫిర్యాదు చేయాలంటే...
కలెక్టర్ ఆదేశాల మేరకు భూ ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందు కోసం 94291 64153తో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును ఇన్‌చార్జిగా నియమించారు. ప్రజలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఈ ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు సమాచారాన్ని ఎప్పటికప్పుడు టౌన్‌ప్లానింగ్ అధికారి, కమిషనర్‌కు చేరవేస్తారు. వారు వాటిపై విచారించి చర్యల నిమిత్తం టాస్క్‌ఫోర్స్ బృందానికి సమాచారమందిస్తారు.
12 మందితో టాస్క్‌ఫోర్స్
ప్రజా ఫిర్యాదుల ఆధారంగా సత్వర చర్యలు చేపట్టేందుకోసం మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల కు సంబంధించి 12మంది సభ్యులతో కూడిన ప్ర త్యేక టాస్క్‌ఫోర్స్‌టీం ఏర్పాటు చేశారు. ఈ టీంకు ప్రత్యేక వాహనం సైతం కేటాయించనున్నారు. టో ల్ ఫ్రీకి అందిన ఫిర్యాదులను పరిశీలించిన మున్సి పల్ కమిషనర్, టీపీవో సూచనలకనుగుణంగా టా స్క్‌ఫోర్స్ టీం క్షేత్రస్థాయికి వెళ్లి వాటిని పరిశీలిస్తుంది. విచారణ చేపట్టి ఆక్రమణలు నిజమని నిర్ధారణ అయితే వాటిపై సత్వరమే చర్యలు చేపడుతుంది. ఫిర్యాదులను టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ డీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి వరకు భాగానే ఉన్నా ఇది ఎంతవరకు అమలుతుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
ఆక్రమణలను ఉపేక్షించబోం..
భూ ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఆది లాబాద్ మున్సిపల్ పరి ధిలో వాటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధి కారులతో టాస్క్‌ఫోర్స్‌టీంను నియమించాం. అలాగే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశాం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టి ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజర్షి షా, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment