కై లాస్‌నగర్: పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న 24 పాఠశాలలకు మంజూరైన నిధులను వసతుల కల్పన కోసం సత్వరమే వినియోగించాలని స్పష్టం చేశారు. తరగతి గదులు, కిచెన్‌గార్డెన్, ఫీల్డ్ విజిట్, ఎల్‌ఈడీ లైటింగ్, తదితర పనులకు వినియోగించుకోవాలన్నారు. సమగ్ర శిక్ష, పీఎంశ్రీ ఫండ్స్‌పై విద్యాశాఖ కార్యదర్శి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో పీఎంశ్రీ పథకం నిధుల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment