
కష్టపడి చదవాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు కష్టపడి చదివి కళాశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ శ్యామలాదే వి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఏర్పడి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందు కు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నా రు. ముందుగా విద్యార్థులు రక్తదానం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. అ నంతరం పూర్వ ప్రిన్సిపాళ్లు నారాయణరావు, సంతోష్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం, వైస్ ప్రిన్సిపాల్ రఘు, ఎన్‌సీసీ కేర్‌టేకర్ చంద్రకాంత్, ప్రోగ్రాం అధికారులు, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment