న్యాయవాదుల నిరసన
ఆదిలాబాద్‌టౌన్: రంగారెడ్డిలోని ఎల్బీనగర్ కోర్టులో జడ్జిపై నిందితుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శు క్రవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నగేశ్ మా ట్లాడుతూ, న్యాయమూర్తిపై ట్రయల్ నిందితు డు దాడి చేయడం పోలీసుల వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు కోర్టులో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చ ర్యలు చేపట్టాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సంతోష్, సభ్యులు చందుసింగ్, అమరేందర్‌రెడ్డి, ప్రదీప్, సుధీర్, మహేందర్, రవీందర్, గంగారెడ్డి, దిలీప్‌దేశ్‌ముఖ్, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment