పన్ను వసూళ్లపై దృష్టి
● ఫోకస్ పెంచిన పంచాయతీ సిబ్బంది ● ఇప్పటి వరకు 58.39 శాతమే వసూలు ● శతశాతం దిశగా శ్రమిస్తున్న కార్యదర్శులు
జిల్లాలో..
గ్రామ పంచాయతీలు 468
ఆస్తి పన్ను బకాయిలు రూ.58,51,923
ఇందులో వసూలైంది రూ.17,44,264
ఈ సంవత్సర పన్ను లక్ష్యం రూ.6,26,56,411
ఇప్పటివరకు వసూలైంది రూ.3,82,54,836
వసూలు చేయాల్సింది రూ.2,85,09,234
కై లాస్‌నగర్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలిచ్చే నిధులు ఎంత కీలకమో, పంచాయతీ ల్లో వసూలయ్యే పన్నులు అంతే అవసరం. అయితే ఏడాదిగా ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. గ్రామాల్లో స మస్యలు పరిష్కరించుకోవాలంటే పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఇన్నాళ్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో బీజీగా గడిపిన కార్యదర్శులు ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఉదయం 8గంటలకే గ్రామాలకు చేరుకుంటున్నారు. సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం (బకాయిలతో కలిపి) రూ.6కోట్ల 85లక్షల8వేల334. ఇందులో ఇప్పటి వరకు వసూలైంది రూ.3కో ట్ల 99లక్షల 99వేల100. ఇది 58.39 శాతం మాత్ర మే. ఆర్థిక సంవత్సరం మరో 43 రోజుల్లో ముగియనుంది. గడువులోపు శతశాతం లక్ష్యసాధన కోసం సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సర్వేల ప్రభావం..
గ్రామ పాలనలో పంచాయతీ కార్యదర్శులదే కీలకపాత్ర. వీరంతా మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్ల సర్వేల్లో బీజీబీజీగా గడిపారు. ఫలితంగా పన్నుల వ సూళ్లపై ఈ ప్రభావం పడింది. ఇప్పటికే 80 శాతా నికి పైగా వసూలు కావాల్సి ఉండగా కేవలం 58 శా తానికి పరిమితం కావడం గమనార్హం. ఇన్నాళ్లు సర్వేల్లో బీజీగా గడిపిన కార్యదర్శులు ప్రస్తుతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు.
66 పంచాయతీల్లో వందశాతం
జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 66 జీపీలు ఇప్పటికే వందశాతం పన్ను వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. వీటిలో అత్యధికంగా నార్నూర్ మండలంలో 12 జీపీలుండగా, ఆదిలా బాద్ రూరల్‌లో 10, భీంపూర్‌లో ఏడు, ఇచ్చోడలో ఆరు, ఇంద్రవెల్లిలో ఐదు, బజార్‌హత్నూర్, బేలలో నాలుగు చొప్పున, నేరడిగొండ, ఉట్నూర్, గాదిగూడల్లో మూడుచొప్పున, బోథ్, తలమడుగు, సిరికొండల్లో రెండు చొప్పున, తాంసిలో ఒకటి ఉన్నాయి. ఇక పన్ను వసూళ్లలో అత్యంత వెనుకబడిన పంచాయతీలను పరి శీలిస్తే.. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్‌లో సున్న శాతం ఉండగా, ఇచ్చోడ మండలం బొరిగా మలో 9శాతం, ఇంద్రవెల్లి మండలం హీరాపూర్, సిరికొండ మండలంలోని ఖానాపూర్ 11 శాతంతో వెనుకబడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment