సాక్షి,ఆదిలాబాద్: ఇది జిల్లాలో కంది రైతుల పరి స్థితి. ఈ పంట దిగుబడులు చేతికొచ్చి రోజులు గ డుస్తున్నాయి. మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించి పది రోజులవుతుంది. అయితే రైతులు మాత్రం కంది పంట దిగుబడులను మార్కెట్‌కు తీసుకొచ్చేది లేదు.. అమ్మేది లేదన్నట్టుగా తమ ఇంట్లో, లేనిపక్షంలో చేనులోనే నిల్వ చేసేశారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఎకరానికి కేవలం 3.31 క్వింటాళ్ల చొప్పున రైతు నుంచి పంట దిగుబడి కొనుగోలు చేస్తామని పరిమితి విధించింది. గతేడాది కందులకు మార్కె ట్లో మద్దతు ధర మించి మంచి ధర లభించింది. కొనుగో ళ్లు ప్రారంభం కాకముందు మార్కెట్లో కందులు క్వింటా లుకు రూ.8వేల నుంచి రూ.8,500 వరకు ధర లభించగా, సీజన్ మొదలు కాగానే ఈ ధర అమాంతం తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.7,200 వరకు మాత్రమే లభిస్తుంది. దీంతో కంది రైతులు ఇటు పరిమితి పెంపు కోసం నిరీక్షిస్తూనే మరోపక్క మార్కెట్లో కందులకు ధర పెరుగుతుందని ఆశతో దిగుబడులను ఇళ్లలోనే నిల్వ చేసేశారు.
ఇదీ పరిస్థితి..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నాఫెడ్‌కు అనుబంధంగా మార్క్‌ఫెడ్ రాష్ట్రంలో కందులను కొనుగోలు చే స్తుంది. జిల్లాలో పది రోజుల క్రితం కొనుగోళ్లు ప్రా రంభించింది. అయితే ఇప్పటివరకు మార్కెట్లో నా మమాత్రంగానే రైతులు కందులను విక్రయించారు. ఇదిలా ఉంటే ఒక్కో రైతు నుంచి రోజుకు 40 క్వింటాళ్ల వరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అయి తే ఎకరానికి పరిమితి నిబంధన కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆదిలా బాద్ ఎమ్మెల్యే శంకర్ వ్యవసాయ శాఖమంత్రి తు మ్మల నాగేశ్వర్‌రావును ఫోన్‌లో సంప్రదించి ఎకరా నికి 8క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరా రు. త్వరలోనే ఈ పరిమితి పెంచుతామని మంత్రి భరోసానిచ్చారు. ఈనేపథ్యంలో ఆ పెంపు ఎప్పుడు జరుగుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
‘సాక్షి’ ఎఫెక్ట్..
జిల్లాలో పది రోజుల క్రితం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొదట నాలుగు కొనుగోలు కేంద్రాలు ఆదిలా బాద్, జైనథ్, ఇంద్రవెల్లి, బోథ్‌లో ఏర్పాటు చేసి కందుల కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే గతేడాది ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి సగానికి తగ్గించారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోనూ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము మరో చోటికి వెళ్లి పంటను అమ్ముకోవడం ద్వారా దూరభారం, రవాణా ఖర్చు పెరుగుతుందని వారిలో ఆందోళన కనిపించింది. తిరిగి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఈ డిమాండ్‌కు తలొగ్గిన మార్క్‌ఫెడ్ గతేడాది మాదిరిగానే తిరిగి బేల, తాంసి, నార్నూర్, ఇచ్చోడ సెంటర్లను పునరుద్ధరించి కొనుగోళ్లను ప్రారంభించారు. ‘సాక్షి’ చొరవను అభినందిస్తూ పలువురు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో..కంది సాగు విస్తీర్ణం 57,258 ఎకరాలు
సాగు చేసిన రైతులు 68,581
దిగుబడి అంచనా 3,43,549 క్వింటాళ్లు
మార్క్‌ఫెడ్ కొనుగోలు లక్ష్యం 1,85,000 క్వింటాళ్లు
ఇప్పటివరకు కొనుగోలు చేసింది 3వేల క్వింటాళ్లు
ప్రభుత్వ మద్దతు ధర రూ.7,550 (క్వింటాలుకు)
ప్రైవేట్ ధర రూ.7,200 (క్వింటాలుకు)
పరిమితి పెంపుపై ప్రతిపాదనలు పంపించాం..
రైతుల నుంచి ఎకరా నికి 6 క్వింటాళ్ల కందుల దిగుబడులను కొనుగోలు చేసే విధంగా పరిమితి పెంచాలని ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది.
– ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment