‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
● కలెక్టర్ రాజర్షి షా ● ఆర్‌వో, ఏఆర్‌వోలకు శిక్షణ
కై లాస్‌నగర్: స్థానిక సంస్థలైన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. ఈసీ షెడ్యూల్‌కు అనుగుణంగా ఆర్‌వోలు నోటిఫికేషన్ జారీ చేసి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. అంతకుముందు ఆర్‌వోలు, ఏఆర్వోల విధులు, పాటించాల్సిన నిబంధనలపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో జి.జితేందర్‌రెడ్డి, డీఎల్‌పీవో ఫణిందర్‌రావు, మాస్టర్‌ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment