సమయపాలన పాటించకుంటే చర్యలు
● రిమ్స్ డైరెక్టర్‌ను వివరణ కోరిన కలెక్టర్ ● ‘సాక్షి’ కథనంపై ఆరా..
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ వైద్యులు, సిబ్బంది సమ య పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని ఈనెల 13న ‘వీళ్లింతే.. మారరంతే..!’ ‘సాక్షి’లో శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. రిమ్స్ డైరెక్టర్‌ను వివరణ కోరారు. వైద్యులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ మే రకు రిమ్స్ డైరెక్టర్ ఆస్పత్రిలోని ప్రొఫెసర్లు, ఆయా విభాగాల హెచ్‌వోడీలు, అసోసియేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రిమ్స్‌కు వచ్చేది పేదలే అధికమని, జిల్లాలో ఎక్కువ శాతం మంది ఆదివాసీ, గిరిజనులు ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులు సక్రమంగా నిర్వహించాలని, అలాగే సమయపాలన పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమయపాలన పాటించకుంటే చర్యలు
Comments
Please login to add a commentAdd a comment