ఫైర్‌స్టేషన్‌కు నూతన వాహనాలు
ఆదిలాబాద్‌టౌన్: విపత్తు సమయాల్లో బాధితులను త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకు తరలించేందు కోసం ఆదిలాబాద్ ఫైర్‌స్టేషన్‌కు ఒక బస్సు, ట్రక్ మంజూరైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్‌కుమార్ శనివారం వాటిని ప్రారంభించారు. పని తీరును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తు సమయంలో సామగ్రితో పాటు ఇతర వస్తువులను తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఫైర్ స్టేషన్లకు వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment