ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ నెల తనిఖీల్లో భాగంగా శనివారం స్థానిక శాంతినగర్‌లో గల ఈవీఎంల గోదాంను కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూం సీలు తెరిపించి గోదాంలో భద్రపర్చిన ఈవీఎంల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూంకు యథావిధిగా సీల్ వేయించి, తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. గోదాం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల, సిబ్బంది దేవరాజ్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment