ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో ని బస్ స్టేషన్లలో పక్కా స్థలం, ఖాళీ ప్రదేశాల్లో వ్యాపారాల నిర్వహణకు సంబంధించి టెండ ర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన ప్రకటనలో పేర్కొన్నారు. ఆక్షన్, మ్యానువల్ టెండర్ల విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, గుడిహత్నూర్, జైనథ్, ఇచ్చోడ బస్‌స్టేషన్లలో మొత్తం 19 స్థలాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఈనెల 19వరకు డిపో మేనేజర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటా యని పేర్కొన్నారు. ఈనెల 20న మధ్యాహ్నం 2గంటల వరకు రీజియన్ కార్యాలయంలో సమర్పించవచ్చని, అదే రోజు 3గంటల వరకు టెండర్లు ఫైనల్ అవుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment