● క్రమబద్ధీకరణపై యంత్రాంగం దృష్టి ● పూర్తయిన వీధి వ్యాప
ప్రత్యేక సర్వే..
కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు ఎంత మంది ఉన్నారనే దాన్ని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టారు. ఐదుగురు రెవెన్యూ అధికారులు, ఐదుగురు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయాచౌక్‌ల్లో సర్వే నిర్వహించారు. వీధి వ్యాపారి పేరు, సెల్‌నంబర్, వారు నిర్వహించే వ్యాపారం వంటి వివరాలు సేకరించారు. సర్వే అనంతరం వారిని అక్కడి నుంచి తరలించనున్నారు. ఇప్పటికే గుర్తించిన గణేశ్ థియేటర్ స్థలం, పాత వెంకటేశ్వర సామిల్ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా స్థలాలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయా చౌక్‌లను సుందరంగా మార్చేందుకు సైతం ఈ ప్రక్రియ తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
కై లాస్‌నగర్: పట్టణంలోని వ్యాపార, వాణిజ్య ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని రహదారులపై భారీ డివైడర్లతో పాటు వాటికిరువైపులా తోపుడుబండ్లు ఏర్పాటు చేసుకుని వీధి వ్యాపారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా మార్గాల్లోని రోడ్లన్నీ ఇరుకుగా మారి ట్రాఫిక్‌కు తరచూ అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆటోలు వెళ్లిన సమయంలో మరో వాహనం వెళ్లలేని పరిస్థితి. పాదాచారులు నడిచేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని తొలగించే దిశగా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వీధి వ్యాపారుల గుర్తింపునకు ప్రత్యేక సర్వే చేపట్టారు. మొత్తం 353 మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సమాచారాన్ని మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. వివరాలను కమిషనర్ పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నారు. అనంతరం వారికి నిర్దేశిత ఎంపిక స్థలాల్లో వ్యాపారాల కోసం స్థలాలు కేటాయించనున్నారు.
జిల్లా కేంద్రంలో ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ పట్టణంలోని దేవీచంద్‌చౌక్ నుంచి గాంధీచౌక్ మీదుగా అంబేడ్కర్‌చౌక్ వరకు, అలాగే అంబేడ్కర్ చౌక్ నుంచి శివాజీచౌక్ వరకు వ్యాపార, వాణిజ్య పరంగా ప్రధాన కూడళ్లు. వివిధ పనుల నిమిత్తం పట్టణవాసులే కాకుండా చుట్టు పక్కల గ్రా మాల నుంచి నిత్యం జనం భారీగా వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని రోడ్లు అసలే చిన్నవిగా ఉండగా, వాటిపై డివైడర్లు నిర్మించడం, అలాగే వాటికి ఇ రువైపులా వీధి వ్యాపారులు తోపుడుబండ్లు ఏర్పా టు చేయడంతో మరింత ఇరుకుగా మారుతున్నా యి. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను రోడ్లపై, షాపుల ఎదుట పార్కింగ్ చేస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతుంది. ఈ పరిస్థితిని తొలగించాలనే ఉద్దేశంతో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల మున్సి పల్, పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీ క్ష నిర్వహించారు. వీధి వ్యాపారులను అక్కడి నుంచి తొలగించడంతో పాటు భారీగా ఉన్న డివైడర్ల ఎత్తు, వెడల్పు తగ్గించాలని ఆదేశించారు. తద్వారా ట్రాఫిక్ సమస్యను నియంత్రించవచ్చని తెలిపారు.
వ్యాపారులు సహకరించాలి
ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ట్రాఫి క్ సమస్యను తొలగించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రధానచౌక్‌ల్లో ఉన్న వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే పూర్తయింది. 353 మంది ఉన్నట్లుగా లెక్క తేలింది. వీరికి గణేశ్ థియేటర్, వెంకటేశ్వర సామిల్ స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. వారు కూడా సహకరించాలి.
– సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్
● క్రమబద్ధీకరణపై యంత్రాంగం దృష్టి ● పూర్తయిన వీధి వ్యాప
● క్రమబద్ధీకరణపై యంత్రాంగం దృష్టి ● పూర్తయిన వీధి వ్యాప
Comments
Please login to add a commentAdd a comment