విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
కైలాస్‌నగర్: ఈనెల 27న నిర్వహించనున్న నిజా మాబాద్–కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై పీవోలు, ఏపీవోలకు జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిన చేపట్టే ఓటింగ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున ఓపిగ్గా, సంయమనంతో వ్యవహరించాలన్నారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వర కు పోలింగ్ ఉంటుందన్నారు. నిర్దేశిత సమ యం లోపు కేంద్రం పరిధిలో క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే ఈ నెల 26న ఉదయం 8గంట లకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పంపిణీ కేంద్రాల వద్ద అందించే పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, చెక్‌లిస్ట్‌లో పొందుపర్చిన మెటీరియ ల్ ఉందా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అనంతరం బృందంతో కలిసి యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళా శాల ప్రవేశాల ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ తన కార్యాలయ చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజర్షి షా
ఎన్నికల నిర్వహణపై పీవో, ఏపీవోలకు శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment