శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు: మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శని వారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ హోమం, యజ్ఞం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూజలు చేసి ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందులో కాటిపెల్లి వసంత్ రెడ్డి, పిడుగు సంజీవరెడ్డి, వెంకటేశ్, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment