వేధింపులకు గురిచేస్తే సమాచారమివ్వండి
ఆదిలాబాద్‌టౌన్: యువతులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీటీంకు ఫిర్యాదు చేయాలని షీటీం ఇన్‌చార్జి సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌కళాశాల వసతి గృహంలో కొనసాగుతున్న భీంపూర్, మావల మండ ల కేజీబీవీ విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారమివ్వాలన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని, అలాగే కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోక్సో, బాల్యవివాహ, ఇతర చట్టాలను వివరించారు. ఇందులో డీఈవో టి.ప్రణీత, పాఠశాలల ప్రత్యేకాధికారులు సీహెచ్.రజనీ, సువర్ణ, సీఆర్టీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment