అప్పుడే.. నీళ్ల గోస
బిందెడు నీళ్ల కోసం..
బిందెడు నీళ్ల కోసం బోరింగ్ వద్ద గంటల కొద్ది పడిగాపులు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు పదినిమిషాల కన్న ఎక్కువ వస్తలేవు. బోరింగ్‌లో నుంచి కూడా గంటకు పది బిందెల నీళ్లు రావట్లేదు. దీంతో పనులు విడిచి పెట్టుకొని నీళ్ల కోసం ఇంటికాడనే ఉండాల్సి వస్తుంది.
– కొడప రుక్మాబాయి, మాన్కపూర్
ఎలాంటి సమస్య లేదు
జిల్లాకు నిత్యం 84 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉండగా ప్రస్తతం పూర్తిస్థాయిలో సరఫరా అవుతోంది. ఇప్పటికై తే ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోలేదు. పైపులైన్లు పగిలిపోవడం, లీకేజీల కారణంగా ఎక్కడైనా సమస్య తలెత్తితే చక్కదిద్దాల్సిన బాధ్యత పంచాయతీలకు అప్పగించాం. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి.
– గోపిచంద్, వాటర్‌గ్రిడ్ , ఈఈ
ఊరు చివరన ఉన్న బోరుబావి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్తులు
జిల్లాలో వేసవి ఆరంభానికి ముందే ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇంకా అనేక గ్రామాలకు పైపులైన్లు లేకపోవడం, చా లా చోట్ల లికేజీలు, విద్యుత్ మోటార్లు కాలిపోవడంతో పాటు భూగర్భజల మట్టం పడిపోవడం వంటి కారణాలతో భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పలు మండలాల్లోని శివారు గ్రామాల్లోనూ నీటి ఇక్కట్లు షురూ అయ్యాయి. వారికి ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావులు, చేదబావులే దిక్కవుతున్నాయి. చాలాచోట్ల ఎడ్లబండ్లపై డ్రమ్ములతో నీటిని తెచ్చుకుంటున్నారు. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని కాలనీలకు ప్రస్తుతం రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నా, ఎండల తీవ్రత పెరిగితే సమస్య తలెత్తే అవకాశముందని తెలుస్తోంది.
అప్పుడే.. నీళ్ల గోస
Comments
Please login to add a commentAdd a comment