‘రియల్’ స్కెచ్!
● అనధికార లేఅవుట్ల క్లియరెన్స్‌కు ప్లాన్ ● ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం ● పెద్ద ఆఫీసర్‌తో రియల్టర్ల ఒప్పందం? ● త్వరలో ప్రణాళిక అమలులోకి..
సాక్షి,ఆదిలాబాద్: మావలలోని సర్వే నం.181లో గల ఓ లేఅవుట్‌కు డీటీసీపీ అనుమతి లేదు. దీంతో ఇందులోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొంత కాలంగా నిలి చిపోయాయి. దళారులు మాత్రం ప్లాట్లను ఒకరి నుంచి మరొకరికి విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్ర క్రియ ముందుకు సాగని పరిస్థితి. ఈ క్రమంలో క్ర య విక్రయదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. మ రోవైపు మార్కెట్లో రియల్ వ్యాపారం మందగించింది. ఈ పరిస్థితుల్లో సదరు రియల్టర్ ఓఎత్తుగడ వేశా డు. సంబంధిత అధికారులతో మంతనాలు జరి పాడు. ఆ ప్లాట్లను క్లియర్ చేసేందుకు వారికి పెద్ద ఆఫర్ ఎర వేశాడు. అది ఫలించింది. బేరసారాలు కొలిక్కి వచ్చాయి. ఇక అమలుపర్చడమే తరువా యి. ఇది కేవలం మావలలోని ఈ ఒక్క సర్వే నంబ ర్‌కే పరిమితం కాదు. ఆదిలాబాద్ చుట్టుపక్కల మా వల, బట్టిసావర్గాం, ఖానాపూర్, చాందలోని వందలాది అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. త్వరలో ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు రియల్టర్లు, పెద్దసారు కలిసి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
ప్రణాళిక ఇలా..
ప్రస్తుతం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతు న్న వారు కొద్దిరోజుల పాటు సెలవులో వెళ్తారు. ఇప్పటికే ఒక సబ్‌రిజిస్ట్రార్ సెలవులో ఉండగా.. మరో సబ్ రిజిస్ట్రార్ కూడా లీవ్‌లో వెళ్తాడు. ఆ తర్వాత ఒక దిగువశ్రేణి ఉద్యోగిని తీసుకొచ్చి కొద్దిరోజుల పాటు ఇన్‌చార్జిగా కూర్చోబెడుతారు. ఆయన ఆధ్వర్యంలో అనధికారిక లేఅవుట్లలోనిప్లాట్ల రిజిస్ట్రేషన్లు చకచకా సాగేలా ప్లాన్ వేశారు.
ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో..
ప్రభుత్వం గతంలో జీవో నం.257 జారీ చేసింది. ఆ ప్రకారం అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరాదు. డీటీసీపీ, ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న ప్లాట్ల కు మాత్రమే ఏడాదిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ఎస్‌ఆర్‌వో కార్యాలయానికి వెళ్లినప్పుడు సబ్‌రిజి స్ట్రార్లు పేర్కొంటున్నారు. లేనిపక్షంలో ఆ ప్లాట్ రిజి స్ట్రేషన్ అయి ఉండి లింక్ డాక్యుమెంట్ కలిగి ఉంటే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే లింక్ డాక్యుమెంట్ లేకపోవడం, ఇటు లేఅవుట్లకు డీటీసీపీ అనుమతి రాకపోవడం, ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ లేకపోవడంతో ఆదిలాబాద్ చుట్టుపక్కల్లోని అనేక వెంచర్లలో ఇలాంటి వందలాది ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా నిలిచిపోయాయి. దీంతో సహజంగానే రియల్ వ్యాపారం ఆదిలా బాద్‌లో స్తబ్ధుగా మారింది.
కోట్ల రూపాయల డీల్..?
ఈ పరిస్థితిలో రియల్టర్లు ఆ పెండింగ్ ప్లాట్లను క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తుగడ వేశారు. అందులో భాగంగా రిజిస్ట్రేషన్‌శాఖ అధికారుల్లో ఓ పెద్ద సారుతో బేరసారాలు నడిపారని ఆదిలాబాద్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్లాట్లన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసిన పక్షంలో ఆయనకు రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకు ఇచ్చేలా డీల్ కుదిరిందని చెప్పుకుంటున్నారు.
దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటా..
ఆదిలాబాద్ ఎస్‌ఆర్‌వో పరిధిలో అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు ఒక్కటి జరిగినా నా దృష్టికి తీసుకురండి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ విజయ్‌కాంత్ రావు సెలవులో వెళ్లారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్నారు. రియల్టర్లతో ప్లాన్ విషయం నా నోటీసుకు రాలేదు.
– రవీందర్‌రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment