8న జాతీయ లోక్‌అదాలత్
కై లాస్‌నగర్: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం మార్చి 8న జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా కోర్టులోని తన చాంబర్‌లో బుధవారం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. సివిల్, బ్యాంకు, ఇన్సూరెన్స్ కేసులతో పాటు రాజీపడదగిన ఇతరత్రా అన్ని కేసులను ఇందులో పరి ష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా కో ర్టుల చుట్టూ తిరిగే అవకాశముండదని, అ లాగే సమయం వృథా కాదన్నారు. ఉద యం 10 నుంచి సాయంత్రం 5గంటల వర కు ఆయా కోర్టుల్లో నిర్వహించే లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకో వా లని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసు లు పరిష్కారం అయ్యేలా పోలీసు అధికారులు,న్యాయవాదులు శ్రద్ధవహించాలన్నారు. ఇందులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment