సోన్: విద్యుత్‌షాక్ గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన మోరే చంద్రకాంత్ లారీడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మండలంలోని మాదాపూర్ గ్రామానికి పసుపు కోసం మంగళవారం వచ్చాడు. గ్రామంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగోరావు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రిమ్స్‌లో యువకుడు..
కైలాస్‌నగర్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాహూర్ తాలుకాలోని కోడ్‌కుప్టి గ్రామానికి చెందిన యువకుడు సెలార్ అంకుష్ (20) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై ముకుంద్‌రావు కథనం ప్రకారం.. అంకుష్ ఈనెల 3న శుభకార్యానికి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు మహారాష్ట్రలోని కోర్టలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై తెలిపారు.
లక్ష్మణచాందలో ఒకరు..
లక్ష్మణచాంద: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండల కేంద్రానికి చెందిన పవర్ రమేశ్ (35) గత మూడురోజుల క్రితం గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment