వాంకిడి: మండలంలోని ఖమానలోని నర్సరీ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పక్కాసమాచారంతో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి మూడు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.8280 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హెడ్‌కానిస్టేబుల్‌కు
గుండెపోటు
● సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు
కడెం: మండలంలోని పాండ్వపూర్ వద్ద అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న దస్తురాబాద్ పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ గోకుల్‌దాస్ బుధవారం గుండెపోటుతో కుప్పకూలాడు. సిబ్బంది అందించిన సమాచారంతో ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డితోపాటు ధన్‌రాజ్, భీంరావు, దేవన్నలు అక్కడికి చేరుకున్నారు. గోకుల్‌దాసును అంబులెన్స్‌లో ఎక్కించి సీపీఆర్ చేస్తూ ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి నిర్మల్‌కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.
పట్టపగలే చోరీ
ఉట్నూర్‌రూరల్: మండలంలోని లింగోజీతండాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రాథోడ్ దశరథ్ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. దశరథ్ బుధవారం ఇంటికి తాళం వేసి ఉదయం 9గంటలకు డ్యూటీకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లో తులంన్నర బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దశరథ్ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడికి చేరుకుని..క్లూస్‌టీం ద్వారా పరిశీలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment