వుషూ క్రీడాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: రాష్ట్రంలో వుషూ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి వుషూ మహిళల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వుషూ క్రీడకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రతీ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వాలు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను కేటాయించాయన్నారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం వుషూ విభాగంలో స్పోర్ట్స్‌కోటా కింద పోస్టల్ శాఖలో ఉద్యోగం రాగా, ప్రస్తుతం ఎస్‌ఎస్బీలో ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న జిల్లాకు చెందిన రాథోడ్ స్వాతిని సత్కరించారు. కార్యక్రమంలో ఉషూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, పెటా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, సాయి, వుషూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణేశ్, వేముల సతీశ్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అన్నారపు వీరేశ్, జిల్లాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రేమ్‌సాగర్
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి
వుషూ క్రీడాపోటీలు
వుషూ క్రీడాభివృద్ధికి కృషి
Comments
Please login to add a commentAdd a comment