గల్ఫ్‌లో జిల్లావాసి బలవన్మరణం
● మృతదేహం తెప్పించాలని కుటుంబీకుల వినతి ● ప్రవాసీమిత్ర సంఘం అధ్యక్షుడిని కలిసి వేడుకోలు
నిర్మల్‌ఖిల్లా: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కార్మికుడు అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన షేక్ ఆన్సర్ (34) ఉపాధి నిమిత్తం ఆరేళ్ల క్రితం సౌదీ ఆ తర్వాత దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని పూజైరాదిబ్బ మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేసేవాడు. గతేడాది సెలవుపై స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. ఈనెల 16న దుబాయ్‌లో నివాసముంటున్న ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి కంపెనీ ఈ విషయాన్ని తాజాగా కుటుంబీకులకు సమాచారం అందించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బుధవారం మృతుడి కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకులు ఏనుగు ముత్యంరెడ్డి, కొర్వ నవీన్, సతీశ్ తదితరులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రవా సీమిత్ర కార్మిక సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లను కలిశారు. మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించాలని విన్నవించారు. గల్ఫ్‌కార్మిక సంఘానికి చెందిన అక్కడి ప్రతినిధులతో మాట్లాడి దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా ఆన్సర్ వివరాలను పంపించారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడుతోపాటు తల్లిదండ్రులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment