‘రాష్ట్రం రాక్షస పాలనలో చిక్కుకుంది’
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ రాక్షస పాలనలో చిక్కుకుందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అన్నా రు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రో జును పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంబరా లు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సాజిదొద్దీన్, శివ, రమేశ్, సురేందర్, ప్రశాంత్, విఠల్, వినోద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment