కేంద్ర మంత్రిని కలిసిన ‘సమగ్ర’ ఉద్యోగులు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను ఢిల్లీలో కలిశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ఇచ్చే పేస్కేల్‌లో 60 శాతం రేషియో ఇవ్వాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్‌చారి, రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, రమేశ్, సంధ్యారాణి, రాజిరెడ్డి, సత్యనారాయణ, బిందుశ్రీ, ప్రియాంక, దీప్తి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment