ఏజెన్సీలో దొంగల హల్‌చల్
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. రాత్రి సమయంలో దొంగలు షాపుల షటర్ తాళాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్తున్నారు. నార్నూర్ మండల కేంద్రంలో పది రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉట్నూర్ మండలం ఎక్స్‌రోడ్ వద్ద రెండు వైన్స్‌షాపులు, గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో ఫర్టిలైజర్, రెండు కిరాణషాపుల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు షాపుల షటర్ తాళాలు పగులగొట్టారు. ఫర్టిలైజర్ షాపులో రూ.60 వేలు, కిరాణషాపుల్లో రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారని బాధితులు సంజీవ్‌గౌడ్, ప్రహ్లాద్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గాదిగూడ్ ఎస్సై నాగ్‌నాథ్ తెలిపారు.
ఇంద్రవెల్లి: మండలంలోని ఈశ్వర్‌నగర్ సమీపంలో జై దుర్గ వైన్స్‌షాపులో గురువారం రాత్రి చోరీ జరిగింది. నిర్వాహకుడు ముండే బాబు..షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. దొంగలు గడ్డపారతో షెటర్ తాళం పగులగొట్టి సీసీ కెమెరాలు, మానిటర్‌ను ధ్వంసం చేశారు. మందు బాటిళ్లతోపాటు కౌంటర్‌లో నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ శుక్రవారం ఉదయం వైన్స్ షాపును పరిశీలించారు. సీసీ ఫుటేజీని నిర్వాహకులు పరిశీలించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment