చాలా సంతోషంగా ఉంది
చిన్నప్పటి నుంచి టీచర్ ఉద్యోగం ఓ కల. డీఎస్సీ–2008లో టీచర్ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంతో అప్పటి నుంచి ప్రైవేట్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రభుత్వ టీచర్ కంటే ప్రైవేట్‌లో పని ఒత్తిడి ఎక్కువ. ఆదివారం, సెలవుదినం పాటించడం అక్కడ తక్కువే. సరిపోని జీతాలతో ఇన్నాళ్లు ఎన్నో ఇక్కట్లు పడ్డాం. ఇన్నేళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్(కాంట్రాక్టు పద్ధతిన) బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉంది. వేమనపల్లి మండలం ఎంపీపీఎస్ గోర్లపల్లి పాఠశాలలో నాకు పోస్టింగ్ ఇచ్చారు.
– యుగంధర్, ఎంపీపీఎస్ గోర్లపల్లి, మం: వేమనపల్లి
Comments
Please login to add a commentAdd a comment