బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కుభీర్: మండలంలోని జుమ్డ గ్రామంలో బాల్యవివాహాన్ని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నా యి.. భైంసా మండలం మహగాం గ్రామానికి చెందిన మైనర్ బాలిక(15)కు కుభీర్ మండలం జుమ్డ గ్రామానికి చెందిన యువకుడితో శుక్రవారం పెళ్లి చేయాలని నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలిసి వెళ్లి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుజాత, ఏఎస్సై యశ్వంత్, తదితరులు ఉన్నారు.
చిట్‌ఫండ్‌లో మోసం
● బాధితురాలి ఫిర్యాదుతో నలుగురిపై కేసు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని భవిత చిట్‌ఫండ్ యాజమాన్యం డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లించడంలో మోసం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో ఉంటున్న హానోగు హారిక.. భవిత చిట్‌ఫండ్‌లో రూ.5 లక్షల చిట్టీ వేసింది. నెలకు రూ.10 వేల చొప్పున 50 నెలలు కట్టాల్సి ఉండగా 41 నెలలు రూ.4.10 లక్షలు చెల్లించింది. చిట్టీ ఎత్తుకునేందుకు 2022 అక్టోబర్‌లో కార్యాలయానికి వెళ్లగా అప్పటికే మూసివేశారు. యజమానుల సెల్ నంబర్లు తెలుసుకుని సంప్రదిస్తే కట్టిన డబ్బులు చెల్లిస్తామని కాలాయాపన చేశారు. తర్వాత చెక్కులు ఇవ్వగా చెక్‌బౌన్స్ అయ్యాయి. వారికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యజమానులు మంచిర్యాలకు చెందిన గుండ ప్రకాశ్‌రావ్, తాడిపల్లి శ్రీనివాస్‌రావు, మేనేజర్లు సుషాంత్, సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చోరీకి యత్నించిన నిందితుడి రిమాండ్
కై లాస్‌నగర్: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీకి యత్నించిన నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన చిట్యాల విజయ ఈనెల 17న కాలనీలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన మనుమడికి మధ్యాహ్న భోజనం చేయించి తిరిగివస్తుంది. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బేర వంశీ బైక్‌పై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు యత్నించాడు. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం స్థానిక నెహ్రుచౌక్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment