ఏళ్ల నిరీక్షణ.. టీచరైన వేళ..
● 17ఏళ్లకు ఫలించిన న్యాయ పోరాటం ● 2008 డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు
మంచిర్యాలఅర్బన్: ఉద్యోగమనేది నిరుద్యోగుల కల. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కావడంతో కల నెరవేరిందని అనుకున్నారు. తెల్లవారితే చాలు పోస్టింగ్ వచ్చేది. కోర్టులో కేసు పడడం.. దక్కినట్లే దక్కిన ఉద్యోగం చేజారడంతో కల చెదిరింది. ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 17ఏళ్లు వేచి చూశారు. ఎప్పటికై నా టీచర్ కల నెరవేరుతుందని ఆశించారు. న్యాయపోరాటం ఫలించడంతో కొలువులు దక్కించుకున్నారు. ఎట్టకేలకు హైకోర్టు ఉత్తర్వులతో డీఎస్సీ–2008 అభ్యర్థులు ఒప్పంద పద్ధతిన నియామక పత్రాలు అందుకున్నారు. ఇటీవల జిల్లాలో 12మందిని ఆయా పాఠశాలలకు కేటాయించారు. కాంట్రాక్టు పద్ధతిన నియామకంతోపాటు వేతనం అంతంతే కావడం వల్ల ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. జిల్లాలో ఆయా పాఠశాలల్లో డిప్యూటేషన్లపై టీచర్లను సర్దుబాటు చేసిన చోట కేటాయించాలని కోరుతున్నారు. ఒప్పంద నియామక పత్రాలు అందుకున్న కొందరిని ‘సాక్షి’ పలుకరించింది. వారి మాటల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment