మంచుకొండల్లో మనోడు
● హిమాలయాలను అధిరోహించిన నిర్మల్ యువకుడు ● 12,500 అడుగుల ట్రెకింగ్ చేసిన ఆదిత్య
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు హిమాలయ పర్వతాల్లోని కేదరికంఠ్‌్, సమ్మిట్ క్యాంప్ తదితర శిఖరాలను అధిరోహించాడు. జిల్లా కేంద్రంలోని బేస్తవార్‌పేట కాలనీకి చెందిన న్యాయవాది లక్కాకుల తుకారం కుమారుడు ఆదిత్య ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని ఎల్‌పీయూ కళాశాలలో ఎంసీఏ అభ్యసిస్తున్నాడు. ఈనెల 8న ఇతను వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 300 మందితో కలిసి మంచు కొండల్లోని హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహించే ప్రయత్నం మొదలుపెట్టాడు. 12న దాదాపు 12,500 అడుగుల ఎత్తున ఉన్న సమ్మిట్ క్యాంప్‌నకు చేరుకున్నాడు. విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలి మధ్యన ఐదు రాత్రులపాటు శ్రమించి లక్ష్యాన్ని చేరుకున్న ట్లు తెలిపాడు. తెలంగాణ నుంచి 8 మంది వరకు లక్ష్యాన్ని చేరుకోగా ఇందులో నిర్మల్ జిల్లా వాసి ఉండడం విశేషం. ఆదిత్య గతంలోనూ బద్రీనాథ్, కేదరీనాథ్, వైష్ణోదేవి ఆలయాలను కాలినడకన సందర్శించారు. పర్వతారోహణ పూర్తయిన అనంతరం యూనివర్సల్ అడ్వెంచర్స్ వారితో ప్రత్యేక ధ్రువీకరణపత్రాన్ని స్వీకరించారు. రాబోయే రోజుల్లో ఎవరెస్టు శిఖరం ఎక్కడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
మంచుకొండల్లో మనోడు
Comments
Please login to add a commentAdd a comment