విద్యుత్ షాక్‌తో రైతు మృతి
తానూరు: అడవి జంతుల బారి నుంచి పంట రక్షించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ కవచమే యమపాశమైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కధం దత్తురాం (51), అంజనాబాయి దంపతులు. శుక్రవారం వారు కొందరు కూలీలతో కలిసి పంట చేను వద్దకు వెళ్లారు. దత్తురాం తాగునీరు తెచ్చేందుకు సమీపంలో ఉన్న పురుషోతం బోరుమోటారు వద్దకు వెళ్లాడు. నీరు పట్టుకునే క్రమంలో అడవి జంతుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగలి అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లేశ్, ఎస్సై శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
నాగాపూర్‌లో కౌలు రైతు..
పెంబి: విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతిచెందిన ఘటన మండలంలోని నాగాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. నా గాపూర్‌కు చెందిన రాపెని మైసయ్య (47) గ్రామశివారులో మొక్కజొన్నను కౌలుకు తీసుకున్నాడు. శుక్రవారం పెద్ద కుమారుడు మహేశ్‌తో కలిసి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లారు. అక్కడ విద్యుత్ బల్బు కోసం అమర్చిన జీ వైరుకు మైసయ్య చేతిలో ఉన్న కొడవలి తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుమారుడు తప్పించే ప్రయత్నం చేయగా తీవ్ర గాయాలయ్యాయి. మైసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన మహేశ్‌ను స్థానికులు ఖానాపూర్‌కు తరలించారు. భార్య భీమక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
Comments
Please login to add a commentAdd a comment