ఆదిలాబాద్: కేంద్రంలోని ఎన్డీయే పాలనలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. పట్టణంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు అనేక పోరాటాలు, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా తీసుకురావడం కార్మిక వర్గాన్ని మోసం చేయడమే అన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ఈమేరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, కార్యవర్గ సభ్యులు కాంతారావు, ఉస్మాన్, గంగయ్య, రమణ, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment