క్రీడాకారులకు సన్మానం
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటడం అభినందనీయమని డీసీసీబీ చైర్మన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అన్నా రు. ఇటీవల ఓయూలో నిర్వహించిన 11వ రా ష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అండ్ త్రో స్ అండ్ జంప్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కా ర్యాలయంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రస్థా యి పోటీల్లో జిల్లా అథ్లెట్లు 16 పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం అని అన్నారు. ప్రతి భ గల క్రీడాకారులను అసోసియేషన్ తరఫున అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment