జిల్లా విద్యార్థినికి సాహిత్య పురస్కారం
ఆదిలాబాద్: జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన గీస శ్రీజ అక్షరయాన్ సాహిత్య పురస్కారానికి ఎంపికై ంది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భార త్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అందజేస్తు న్న ఈ పురస్కారానికి శ్రీజ ఎంపికై నట్లు నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మార్చి 2న మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీజ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పురస్కారానికి ఎంపిక కావడంపై ఆమెకు పలు వురు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment