‘ఇంటిగ్రేటెడ్‌’కు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

‘ఇంటిగ్రేటెడ్‌’కు శ్రీకారం

Published Sat, Feb 22 2025 2:30 AM | Last Updated on Sat, Feb 22 2025 2:28 AM

‘ఇంటిగ్రేటెడ్‌’కు శ్రీకారం

‘ఇంటిగ్రేటెడ్‌’కు శ్రీకారం

● ఇక యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు ● అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. ● ఉమ్మడి జిల్లాలో 10 చోట్ల స్థలాల గుర్తింపు ● 2,500 మందికి విద్యనందించేలా సకల వసతులు

కైలాస్‌నగర్‌:నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థా యి విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల కు శ్రీకారం చుట్టింది. ఒక్కోపాఠశాలలో2500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గానికో పాఠశాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన స్థలాలను గుర్తించాల్సింది గా కలెక్టర్లను ఆదేశించింది. ఇందులోభాగంగా రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ బోర్డు కమిషనర్‌, ఉమ్మడి జిల్లా ప్ర త్యేకాధికారి కృష్ణ ఆదిత్య బుధవారం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో స్థలాల ఎంపికపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా పది నియోజకవర్గాల్లో ఆయా జల్లాల అధికారులు అవసరమైన స్థలాలను గుర్తించారు. వివరాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర సర్కారు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పరిపాలన మంజూరు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూ.200 కోట్లతో భవనాల నిర్మాణం

పేద విద్యార్థులకు ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, నైపుణ్యశిక్షణ అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. తరగతి గదులు, వసతిగృహాలు, ఆట స్థలం వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఒక్కో పాఠశాలను 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూ ర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చే స్తున్నారు. అవసరమైన స్థలాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుర్తించిన స్థలాల వివరాలు

నియోజకవర్గం గుర్తించిన ప్రాంతం మండలం

ఆదిలాబాద్‌ నిషాన్‌ఘాట్‌ ఆదిలాబాద్‌రూరల్‌

బోథ్‌ అడెగామ ఇచ్చోడ

ఖానాపూర్‌ పులిమడుగు ఉట్నూర్‌

నిర్మల్‌ సిర్గాపూర్‌ దిలావర్‌పూర్‌

ముథోల్‌ భైంసా భైంసా

మంచిర్యాల రెబ్బెనపల్లి దండేపల్లి

బెల్లంపల్లి గురుజాల బెల్లంపల్లి

చెన్నూర్‌ సోమన్‌పల్లి చెన్నూర్‌

ఆసిఫాబాద్‌ ఇందాని వాంకిడి

సిర్పూర్‌ చెడ్వాయి పెంచికల్‌పేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement