పూర్తిస్థాయిలో కందుల కొనుగోలుకు చర్యలు
● కలెక్టర్ రాజర్షి షా
తాంసి: రైతులు పండించిన పంట దిగుబడులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కందుల కొనుగోళ్ల విషయంలో నిర్దేశిత నిబంధన సడలించాలని రైతుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులతో మాట్లాడి వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో ఉన్న కంది దిగుబడులను సైతం పరిశీలించారు. ముందుగా హస్నాపూర్ రైతు వేదికలో హస్నాపూర్, ఖోడద్ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, ఈ ప్రాంతంలో నల్లరేగడి భూమి ఉండటం వలన కంది దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు వస్తున్నట్లు రైతులు తెలిపారని అన్నా రు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి, డీసీవో మోహన్, ఏవో రవీందర్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లావణ్య వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
పొచ్చరలో..
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని పొచ్చర గ్రా మంలోని కంది రైతులతో కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో అడిగి తెలుసుకున్నారు. పంట కొనుగోలు పరిమితి పెంచే విషయంపై మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట వ్యవసాయ అధికారులు రైతులు, ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment