మిగిలింది.. ముగ్గురే!
సర్కారు బడి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇక్కడ కనిపిస్తున్నది నేరడిగొండ మండలంలోని మారుమూల గ్రామమైన గోవింద్‌పూర్ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు ఈ బడి సుమారు 50 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో ఉండేది. ప్రైవేట్ పాఠశాలల ప్రభావంతో క్రమేణ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ మేరకు ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గింది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య మూడుకు చేరగా.. ఉపాధ్యాయుడు ఒక్కరే మిగిలారు. ఒకటో తరగతి చదివే ఈ ముగ్గురు చిన్నారులకు ఉపాధ్యాయుడు రవీందర్ నిత్యం ఇలా బోధిస్తున్నాడు. – నేరడిగొండ
Comments
Please login to add a commentAdd a comment