నేడు, రేపు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
మంచిర్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు, రేపు రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వారం రోజులుగా ఎండలు మండి పోతుండగా గురువారం జిల్లాలో కాస్తా మబ్బుపట్టి ఉంది. శుక్ర, శనివారాల్లో వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద నిల్చోరాదన్నారు. కోసిన పంటలను ముందస్తుగా సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్‌తో కప్పి ఉంచాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయలు ముందస్తుగా కోసుకోవాలని, పురుగు మందుల పిచికారీ తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.
విద్యార్థి అదృశ్యం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి గురువారం అదృశ్యమయ్యాడు. బేల మండలంలోని గణేశ్‌పూర్‌కు చెందిన మడావి రాకేష్ ఆదిలాబా ద్ పట్టణంలోని గోపాలకృష్ణ విద్యామందిర్‌లో ఐదోతరగతి చదువుతున్నాడు. వసతిగృహంలో ఉంటూ విద్యాబోధన చేస్తున్నాడు. ఇంటర్వెల్ సమయంలో విద్యార్థి కనిపించకుండా పోవడంతో ప్రిన్సిపాల్ మాధవ్‌రావు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమో దు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment