రంజాన్ నేపథ్యంలో మార్కెట్‌లో హలీం సెంటర్లు వెలిశాయి. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు వీటిని ఏర్పాటు చేయగా సాయంత్రం కిక్కిరిసిపోతున్నాయి.
తాంసి మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీరు అందిస్తున్నప్పటికీ పూర్తిగా సరిపోని పరిస్థితి నెలకొంది. రోజు విడిచి రోజు ఈ నీళ్లు వస్తుండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని విద్యానగర్ కాలనీకి సరిపడా నీరు రాక కాలనీలోని సాయిబాబా ఆలయంలో ఉన్న మోటర్ నుంచి కాలనీవాసులు తాగునీటిని బిందెలతో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది.