టీపీబీవోగా సాయికృష్ణ
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సిర్ (టీపీబీవో)గా జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన అంగునూరి సాయికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఎస్.దేవేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చే శారు. శుక్రవారం సాయికృష్ణ మున్సిపల్ కమి షనర్ సీవీఎన్ రాజును ఆయన కార్యాలయంలో కలిసి రిపోర్ట్ చేశారు. కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి తనను తాను పరిచయం చేసుకున్నారు. జిల్లాలో కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది.
Comments
Please login to add a commentAdd a comment