వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ సద్వినియోగం చేసుకోండి
కై లాస్‌నగర్: అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు అన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం పట్టణంలోని న్యూహౌసింగ్‌బోర్డు కాలనీలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్‌ఆర్‌ఎస్ మేళా నిర్వహించారు. దరఖాస్తుదారుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటు ప్రక్రియ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 31వరకు ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీ పొందవచ్చన్నారు. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీఎస్ నవీన్ కుమార్, వార్డు అధికారి అక్షయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హమాలీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
● ఈనెల 27వరకు దరఖాస్తుకు అవకాశం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో హమాలీల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు మార్కెటింగ్ అధికారులు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 100 మంది, జైనథ్ మార్కెట్ యార్డు పరిధిలో జైనథ్‌లో 100, బేల సబ్ మార్కెట్‌లో 50 మంది, ఇచ్చోడలో 30, బోథ్‌లో 32, ఇంద్రవెల్లి మార్కెట్‌యార్డు పరిధిలో ఇంద్రవెల్లిలో 30, నార్నూర్‌లో 20 మంది హమాలీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 24 నుంచి 27వరకు సంబంధిత మార్కెట్ యార్డుల్లో సాయంత్రం ఐదు గంటల్లోపు అందజేయాలన్నారు. ఒక వ్యక్తి ఒకే మార్కెట్‌యార్డులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శారీరక సామర్థ్యం (బ్యాగ్‌లోడింగ్, ఆన్‌లోడింగ్) పరీక్ష ఆధారంగా హమాలీలను నియమించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment