ఉద్యోగ భద్రత కల్పించాలి
కైలాస్‌నగర్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు ఉ ద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆది వాసీ గిరిజన విద్యార్థులకు 24 గంటల పా టు అందుబాటులో ఉండి వైద్యసేవలందిస్తున్న ఏఎన్‌ఎంలకు సెలవులు ఇవ్వకుండా వేతనాల్లో కోత విదించడం సరికాదన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, పింఛన్, ఇన్సూరె న్స్ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ గు ర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుంలో జిల్లా అధ్యక్షురాలు కమ ల, కోశాధికారి శ్యాంసుందర్, నర్మద, కామేశ్వరి, జంగుబాయి, అశ్విని, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment