
టీబీ రహిత సమాజానికి కృషిచేయాలి
ఆదిలాబాద్‌టౌన్: టీబీ రహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. సోమవారం రి మ్స్‌లోని ఆడిటోరియంలో ప్రపంచ టీబీ ది నోత్సవాన్ని నిర్వహించారు. వైద్య విద్యార్థులకు టీబీ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలు, చికిత్స విధానాలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. మెడికోలకు రంగోళి, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో టీబీని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో టీబీ ఎక్కువగా ఉందని, అవగాహన రాహిత్యంతోనే వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. టీబీపై వంద రోజుల అవగాహన కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. మూడు వారాల కంటే ఎక్కువ దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే రిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, మెడికోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment