కవితతో(పేరు మార్చడం జరిగింది) కలిపి ఆ కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెలు. అక్కాచెల్లెళ్లలో కవితనే పెద్ద. కవిత 12వ తరగతి చదవుతున్నప్పుడే ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కవిత తండ్రి ఇటీవల మరణించడంతో.. తల్లి ఆమెకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కవిత చదువుపై డబ్బులు ఖర్చు చేయకుండా.. ఆ డబ్బుతో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలని భావించారు. అయితే కవితకు మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న కవిత.. ఈ విషయాన్ని తన ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీంతో వారు తక్షణమే కవిత కోరికకు మద్దుతుగా నిలిచారు. కవిత తల్లితో మాట్లాడారు. చివరకు కవిత చదువును కొనసాగించడానికి ఆమె తల్లిని విజయవంతంగా ఒప్పించగలిగారు.
ఈ ఘటన కవితలో సంతోషాన్ని నింపింది. తన స్కూల్‌లో రూమ్ టు రీడ్ కార్యక్రమం లో భాగంగా తనకు లభించిన ‘జీవణ నైపుణ్య పాఠాల’ వల్ల కుటుంబ ఒత్తిడిని తట్టుకుని నిలబడే ధైర్యం వచ్చిందని కవిత చెప్పారు. అక్కడ తాను జెండర్ సమస్యల పై అవగాహన పొందానని, ఉపాధ్యాయులపై నమ్మకం పెంచుకున్నానని తెలిపారు. తన అభిప్రాయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడానికి, చర్చలు జరపడానికి విశ్వాసం ఇచ్చారని పేర్కొన్నారు.
కవిత లాగే.. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు.. పిల్లలను స్కూల్ మాన్పించే పరిస్థితులకు దారితీశాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్లో చాలా వరకు ముఖ్యంగా బాలికను పాఠశాలలకు దూరం చేయాలనే మార్గాన్ని ఎంచుకున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అధ్యయనం ప్రకారం.. దేశంలో దాదాపు 321 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. ఇది భారీ లెర్నింగ్ గ్యాప్‌కు దారితీయడంతో పాటుగా వివిధ రక్షణ సంబంధిత సమస్యలకు కారణమైంది.
కొన్ని కుటుంబాలు బాలికలను పాఠశాలలకు పంపడం అదనపు భారంగా భావించడం వల్ల వారు అధిక దుర్భలత్వాన్ని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. దేశంలో ప్రముఖ బాలల హక్కుల సంస్థ- CRY తాజా అధ్యయనం ప్రకారం.. సర్వే చేసిన 52 గ్రామాల్లో బాల్య వివాహాలు రెట్టింపు అయ్యాయి. కోవిడ్ సమయంలో తెలంగాణలో బాల్య వివాహాలు పెరిగినట్టుగా ఆ నివేదిక పేర్కొంది.
ఈ సంఘటనలను పరిశీలించిన రూమ్ టు రీడ్ (Room to Read).. తెలంగాణలో యుక్త వయస్సులో ఉన్న బాలికల విద్య, వారి రక్షణను కొనసాగింపుకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వంతో బహుళ స్థాయి సహకార విధానాన్ని అమలు చేయడానికి ముందుకు సాగింది. ఈ లక్ష్యాన్ని సాధించే వ్యుహాంలో.. బాలికల విద్యకు మద్దతుగా సమాజాన్ని సమీకరించడం, జీవన నైపుణ్యాల విద్యను ప్రోత్సహించడం, బాలికలు వారి మాధ్యమిక విద్యను పూర్తి చేయడానికి వారికి అందుతున్న సహాయ సాకారాలను బలోపేతం చేయడం వంటివి ఉన్నాయి. బాలికలు బడి మానేయకుండా నిరోధించే అంశంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు తెలంగాణ మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సహకారంతో 33 జిల్లాల్లోని 14,000 గ్రామాల్లో 3 లక్షల పోస్టర్లు పంపిణీ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించడం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్థానిక కళారూపాల ద్వారా స్కూల్ డ్రాప్ అవుట్ రేటు గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మారుమూల గ్రామాలకు చేరుకోవడానికి రేడియో, టీవీ, డిజిటల్ మీడియాతో సహా ఇతర ప్రత్యామ్నాయ మధ్యమాలను కూడా ఉపయోగించడమైనది.
రాష్ట్ర విద్యాశాఖ మద్దతుతో ఈ సమస్యను మరింత విస్తృతంగా అందరికి వివరించేలా సహకార విధానం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 7245 మంది జిల్లా అధికారులు వర్చువల్ గా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలలో పాల్గొన్నారు. బాలికల విద్యపై మహమ్మారి ప్రభావం, డిజిటల్ విభజనకు(డిజిటల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్‌కు అందుబాటులో ఉన్న వారికి, లేని వారికి మధ్య అగాధం) సంబంధించిన సవాళ్లపై రాష్ట్ర స్థాయి వర్చువల్ కార్యక్రమానికి రాష్ట్ర కమీషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ చైర్‌పర్సన్ జే శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత సమయంలో బాలికలకు రిమోట్‌విధానంలో మద్దతునిచ్చే విధంగా ముఖ్యమైన జీవన నైపుణ్యాల విద్య ప్రణాళిక చేయబడింది. ఈ ప్రోగ్రామ్‌లలో వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణ, భావోద్వేగ శ్రేయస్సు చుట్టూ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుత డిజిటల్ విభజన ఈ లక్షాలను సాధించడంలో పెద్ద అవరోధంగా నిలిచింది. అయితే రేడియో.. విస్తృతమైన పరిధిని అందించడం ద్వారా ఈ సవాలును అధిగమించడానికి ఉపయోగపడింది. 32 జీవన నైపుణ్యాల ఎపిసోడ్‌లు రూపొందించి..వాటిని రేడియో, దూరదర్శన్, ఇతర ప్రైవేట్ ఛానెలల్స్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది .
గద్వాల్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో 8వ తరగతి చదువుతున్న శ్రుతి మాట్లాడుతూ.. ‘నేను ప్రతిరోజూ ఈ రేడియో ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తుండేదానిని . ఎందుకంటే.. పాఠశాలలు మూసివేయబడి, లాక్‌డౌన్‌తో నేను ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి, ఇంటి పనుల్లో కుటుంబానికి సహాయం చేసిన తర్వాత.. నన్ను నేను మరింతగా అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగ పడ్డాయి. ప్రోగ్రామ్‌లోని కథనాలు చాలావరకు సందర్భానుసారంగా ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి దోహదపడ్డాయి ’ అని తెలిపారు.
బాలికలు తమ విద్యను పూర్తి చేసేలా ప్రోత్సహించడం, డ్రాపౌట్స్ ను తగ్గించడం, బాల్య వివాహాలకు సంబంధించిన సామాజిక ఒత్తిడిని నిరోధించడం అనేది లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అందించడం వెనక ఉన్న లక్ష్యం. కవిత, శ్రుతి మాదిరిగానే తెలంగాణలో చాలా మంది అమ్మాయిలు జీవన నైపుణ్యాల పాఠాల వల్ల ప్రయోజనం పొందారు. కరోనా మహమ్మారి సమయంలో.. కౌమరదశలో ఉన్న బాలికలు మద్దతు కోసం టీచర్లను, సోషల్ మొబిలైజర్‌లను సంప్రదించిన సంఖ్యను బట్టి చూస్తే రూమ్ టు రీడ్ మద్దతు కలిగించే వ్యవస్థల యొక్క సమర్థవంతమైన నెట్‌వర్క్‌ను విజయవంతంగా సృష్టించగలిగినట్లు కనిపిస్తోంది.
72 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది.. పాఠశాల నుండి డ్రాప్ అవుట్స్ ని నిరోధించేందుకు బాలికలకు అవసరమైన ప్రాక్టికల్ సపోర్ట్‌ను అందించడానికి సమర్థతతో కూడిన శిక్షణ పొందారు. బాలికలకు సురక్షితమైన ప్రదేశాన్ని ఇవ్వడానికి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి దాదాపు 54 మోడల్ లైఫ్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రూమ్ టు రీడ్ 'లైఫ్ స్కిల్స్ ఇన్ ఎ బాక్స్' అనే ‘‘సెల్ప్ లెర్నింగ్’’ కిట్‌ను కూడా రూపొందించింది. ఇది బాలికల విద్యను కొనసాగించడంలో సహాయపడింది. ఇలాంటి విధానాల ద్వారా రూమ్ టు రీడ్ .. 14,000 గ్రామాలకు చేరుకొని రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది బాలికలకు మద్దతునిచ్చింది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిరంతర సహకారంతో ఈ విస్తృతమైన ప్రాజెక్ట్ ని అమలు చేయడానికి సాధ్యమైంది.
బాలికలు సెకండరీ విద్యను పూర్తి చేయడానికి, భవిష్యత్తులో కీలకమైన జీవిత నిర్ణయాలను చర్చించే నైపుణ్యాలను కలిగి ఉండటానికి మద్దతు ఇవ్వాలనే దానిపై దృష్టిని సారించడానికి RtR ప్రయత్నిస్తోంది. మా కార్యక్రమాల గురించి మరింతగా తెలుసుకోవడానికి సందర్శించండి (www.roomtoread.org).
(అడ్వటోరియల్)
Comments
Please login to add a commentAdd a comment