ముంచంగిపుట్టు: మండలంలోని వనుగుమ్మ పంచాయతీ సంగడ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి(20) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. పాడేరులోని మోదమాంబ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైసీపీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె కొద్దిరోజులుగా గొంతు, శ్వాస సమస్యతో బాధపడుతోంది. ఆమెను తల్లిదండ్రులు ప్రధాన అర్జున్, కౌసల్య ఈ నెల 23న ఒడిశాలోని ఆశా కిరణ్ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యసేవలు అందించారు.
అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో అక్కడ నుంచి విశాఖ తీసుకువచ్చి కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహానికి సంగడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వైస్ ఎంపీపీ భాగ్యవతి, సర్పంచ్ మిల్కి, సీపీఎం నేత శంకర్‌రావు, వైఎస్సార్‌సీపీ మండల నేత దేవ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
గిరిజన ప్రాంతంలో తరచూ విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యాయని వారు ఆరోపించారు. హెల్త్ వర్కర్ల నియామకంలో నిర్లక్ష్య చేస్తోందన్నారు. విద్యార్థిని జ్యోతి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment