నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించాలి
సాక్షి,పాడేరు: పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధిత కుటుంబాలను నూతనంగా నిర్మించిన పునరావస కాలనీలకు తరలించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు.శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుజేస్తామన్నారు.రంపచోడవరం డివిజన్‌లో 2, చింతూరు డివిజన్‌లో 4 ఆర్‌అండ్‌ఆర్ కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముంపు బాధితులకు ల్యాండ్ టూ ల్యాండ్ మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.గిరిజనేతరుల్లో చాలా మందికి గోకవరంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో గృహాలు నిర్మించామని,మిగిలిన అర్హులకు గృహాలు నిర్మిస్తామన్నారు. చింతూరు డివిజన్‌లో జులై,ఆగస్టు నెలల్లో వచ్చే వరదల కంటే ముందుగానే కాలనీలు పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అర్హులైన ముంపు బాధితులను గుర్తించి సమగ్ర పరిశీలన అనంతరం నివేదికల ఆధారంగా ప్యాకేజీ అమలుజేయాలని,వెలగపూడి కాలనీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఐటీడీఏ పీవో, సబ్‌కలెక్టర్,ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఏర్పాటు చేసే సమావేశాలకు ప్రత్యేక ఉప కలెక్టర్‌కు గైర్హాజరు అవడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు.ఇకపై సమావేశాలకు హాజరుకాని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ప్రత్యేక కలెక్టర్ సరళవందన, పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అడ్మినిస్ట్రేటివ్ అఽధికారి వి.అభిషేక్,రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ,ఎస్‌డీసీలు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
భూమికి భూమి బదలాయింపునకు భూసేకరణ వేగవంతం
నష్ట పరిహారం చెల్లింపునకు చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment