ప్రశాంత వాతావరణంలో ఇంటర్, టెన్త్ పరీక్షలు
రంపచోడవరం: ప్రశాంత వాతావరణంలో ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహించేలా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం ఆర్‌జేడీ, జిల్లా విద్యాశాఖాధికారులు,గిరిజన సంక్షేమ డీడీ,ఎంఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 16 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పది, ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం బోధించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో మాస్ కాఫియింగ్ జరగకూడదన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ,డీఎఫ్‌వో రవీంద్ర ధామలు విద్యాశాఖ ఆర్‌జేడీ నాగమణి, ఇంటర్ ఆర్‌జేడీ నరసింహమూర్తి, డీఈవో బి.బ్రహ్మాజీరావు, డీడీ విజయశాంతి, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, ఏటీడబ్ల్యూవోలు మోహన్‌కృష్ణ, రామతులసి, సుజాత,ఎంఈవోలు ముత్యాలరావు, రామకృష్ణ, తాతబ్బాయి, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment