ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్
అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం డిగ్రీ కళాశాలల విద్యార్థుల జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, 100, 200 మీటర్ల రన్నింగ్ , లాంగ్ జంప్, హైజంప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 200 మంది విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పీఈటీలు అప్పారావు, శివరామకుమార్, ప్రసాద్, కోచ్‌లు గణపతి, రాజబాబు, శ్రీను, స్వామి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.ఎస్.ఎన్. మూర్తి, అనంతగిరి ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సన్యాసినాయుడులతో పాటు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు వై. విజయలక్ష్మి, ఎం.అనిత కుమారి, పి.నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్
Comments
Please login to add a commentAdd a comment