క్రీడలతో మానసికోల్లాసం
పాడేరు: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచే ఆటలపై మక్కువ పెంచుకోవాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. పట్టణంలోని తలార్‌సింగి గౌతమి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్‌కు గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. క్రీడ జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మాణిక్యం, పాఠశాల ప్రిన్సిపాల్ శివ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు కూడా సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
Comments
Please login to add a commentAdd a comment